
MLA Gandra Satyanarayana Rao.
కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగ గ్రామంలో సోమవారం రోజున బుడగ జంగాలకు 10 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన భూపాల పెళ్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం కోరే ప్రభుత్వమని అందులో భాగంగా బుడగ జంగాలకు పది లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేయడం జరిగిందని బుడగజంగాలకు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు, అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని తొందరగా ఇందిరమ్మ లబ్ధిదారులు ఇండ్లను పూర్తి చేసుకోవాలని పేదవాళ్ల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు,ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి టేకుమట్ల మాజీ జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, ఎంపీడీవో జయ శ్రీ, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల రాజిరెడ్డి బుచ్చిరెడ్డి జయపాల్ రెడ్డి జంపయ్య ఎంపీడీవో పాల్గొన్నారు