ఉప్పల్ నేటి ధాత్రి 15:
కాప్రా డివిజన్ పరిధిలోని అరుణ్ నగర్ మరియు వినాయక్ నగర్ ఫేస్ -3 లో 40 లక్షల నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున పనుల్లో జాప్యం జరిగింది అని నియోజక వర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజు శివమణి , బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, డి.జి.ఎం సతీష్ , ఏ ఈ రోహిత్ కాలనీల అధ్యక్షులు ,బీఆర్ఎస్ స్పార్టీ నాయకులు కార్యకర్తలు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
