> అభివృద్ధి, సంక్షేమ ఫలాలకు కేంద్రమైన బీఆర్ఎస్ పార్టీ..
> అందరూ కలిసికట్టుగా పని చేయాలి..
> ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
జడ్చర్ల
నియోజకవర్గంలోని రాజాపూర్ మండలంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, స్థానిక మండల ప్రజాప్రతినిధులతో కలసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అశేష జనవాహిని మధ్య కార్యకర్తల సందడితో ప్రచారం కొనసాగింది. సిఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ సిఎంగా,మరోసారి మన జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,జనహృదయనేత సి .లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ముందుగా పలుగుమీది తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని పలువురు అడబిడ్డలను ఆప్యాయంగా పలకరించి వారితో సంక్షేమ పథకాల అమలు తీరును చర్చించారు. వారు ప్రతి రోజు త్రాగునీరు వస్తున్నాయని,కరెంటు ఉంటుందని ఎమ్మెల్యే కి తెలిపారు.
గృహాలక్ష్మి పధకంలో భాగంగా తాండలో కొన్ని ఇండ్లు మంజూరు చేశామని ఎన్నికలు అయిపోగానే ఇండ్లు మొదలుపెట్టుకుందాం అని అన్నారు.
అనంతరం పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ రైతుబంధు పధకాన్ని ఆపాలని నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెడదాం అని ప్రజలకి పిలుపునిచ్చారు.
రైతు ప్రయోజనాలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతునిస్తు కారు గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
కొండాపూర్ లో కారెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
> ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో కారెక్కిన మాజీ ఎంపీటీసీ దామోదర చారి.
> మల్లారెడ్డిపల్లి నుంచి 50 మంది యువకులు చేరిక.
నవాబుపేట మండలం కొండాపూర్ కు చెందిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామోదర చారి నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండలంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న దామోదరచారి బీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి బీటలు పడ్డాయి. అదేవిధంగా మల్లారెడ్డిపల్లికి చెందిన (50) మంది యువకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామోదర చారి సహా యువకులందరికీ లక్ష్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దామోదర చారి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రైతులకు మూడు గంటల కరెంటు నినాదంతో రైతుల సంక్షేమాన్ని మరిచిందని, గత పదేళ్లుగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను గడపగడపకు చేర్చిందన్నారు. ఇవాళ తాగునీటికి ఇబ్బందులు లేవని, రైతులు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.