హసన్ పర్తి/ నేటి ధాత్రి
హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండల పరిధిలోని నాగారం పెద్దచెరువు ఆయా కట్ట పునరుద్ధరణ మరియు సుందరీకరణకు పూజ కార్యక్రమం చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో హాసన్ పర్తి మండల నాగారం పెద్ద చెరువు ఆయాకట్టు కోసం సుమారు 20 కోట్ల రూపాయలతో ఈరోజు ఆయా కట్ట పునరుద్ధరణ మరియు సుందరీకరణకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమని దీన్ని త్వరగా పూర్తిచేసి ప్రజల మధ్యలోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే తెలియజేయటం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక గ్రామ నాయకులు,ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిళ్లి వెంకట్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి, మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు సౌరం చరణ్, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఈఈ, డిఈ, ఏఈ , ఎమ్మార్వో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.