
కూకట్పల్లి, ఫిబ్రవరి 15 నేటి ధాత్రి ఇన్చార్జి
ఆలివ్ స్వీట్స్ వారు విద్యార్థులకు ఇచ్చిన మిషన్ 10/10 కార్యక్రమం లో భాగంగా కూకట్పల్లి నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ గల విద్యార్థుల ను 15 మందినిఎంపిక చేసి వారినీ ప్రోత్సహించేందుకు అతిపెద్ద సా
ఫ్ట్వేర్ కంపెనీలను,టి హబ్ ..ఇండియన్ బిజినెస్ స్కూల్ సంద ర్శించేందుకు తీసుకు వెళ్ళడం జరిగింది …ఈ సంద
ర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆలివ్ స్వీట్స్ అధినేత దొర రాజుని అభినందిస్తూ …ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఎంతో సంతోషకరంగా ఉందని ఇందుకు కూకట్పల్లి నియోజకవర్గ పిల్లలను ఎం
పిక చేసుకుని వారికి తోడ్పాటున అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు …అలాగే ఇలా పిల్లలకు ఒక మోటివేషన్ అందించడం వల్ల వాళ్లు భవిష్యత్తులో
ఏదో సాధించాలన్న తపన పెరుగుతుందని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా నేడు అత్యున్నత శిఖరాలకు చేరిన సందర్భాలు ఉన్నాయని అన్నారు.. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఏది ఆసక్తి
ఉంటే అందులో రాణించేటట్లు చూడాలని వారికి నచ్చి
న సబ్జెక్టును ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించాలని కో
రారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్య
నారాయణ.. ఆలివ్ స్వీట్స్ అధినేత దొర రాజు..
ఎంఈఓ ఆంజనేయులు ఉపాధ్యాయులు
పాల్గొన్నారు.