
MLA Inspects Tribal Girls Hostel
ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
విద్యార్థుల సమస్యలను ఐటీడీఏ పీవో కు ఫోన్ లైన్లో వివరించిన ఎమ్మెల్యే
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ తరగతి గదిని ఎమ్మెల్యే తిరుగుతూ విద్యార్థుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు.

గత పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ పని చేయడం లేదని కొత్త ఆర్వో ప్లాంట్ కావాలని, వేడి నీటి కొరకు గ్లీజర్, మూడు నెలల నుండి కాస్మోటిక్ సామాగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, క్రీడా సామాగ్రి, దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు కూడా సరిగా తిరగడం లేదని తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. సమస్యలను విన్న ఎమ్మెల్యే వెంటనే ఏటూరునాగారం ఐటిడిఏ పీఓకు ఫోన్ చేసి సమస్యలను వివరించారు. సమస్యలను వీలైనంత త్వరగా ఎస్టిమేట్స్ వేసి పనులను ప్రారంభించి పూర్తయ్యేలా చూడాలని కోరారు. విద్యార్థుల వసతి గృహాన్ని పక్కనున్న భవనంలోకి మార్చాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు