
పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
విద్యార్థుల బోధన విన్న.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
మహబూబ్ నగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంగర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుకొంటున్నారని అడిగారు. మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ బోర్డులో మీ టీచర్లు పాఠాలు బోధిస్తున్నారా.. అని అడిగారు. మీకు డిజిటల్ బోర్డు ఉపయోగించడం తెలుసా అని అడిగారు. కొందరు విద్యార్థులు డిజిటల్ బోర్డు మీద ఫిజిక్స్, బయాలజీ , సబ్జెక్టులను బోధించారు. ఎమ్మెల్యే ఆసక్తిగా విన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిఎంఓ బాలు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్ అలి, రామస్వామి, కృష్ణకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి, దోమ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.