దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
నడికూడ,నేటిధాత్రి:
అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఇటీవలే అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.పంట నష్టానికి గల కారణాలను రైతుల అడిగి తెలుసుకున్నారు.
నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంట నష్టంను అంచనా వేయాలని ఆదేశించారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఆరుగాలం కష్టించి రైతు సాగు చేసి,పండించిన పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం వడగండ్ల వాన వలన రైతులు నష్టపోయి బాధపడుతున్నారని,నష్టపోయిన ప్రతి గింజకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,అధికారులు ప్రజాప్రతినిధులు,రైతులు ఉన్నారు.