వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
– రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే…
కొల్చారం, (మెదక్ )నేటిధాత్రి :-
మండలపరిధిలోనిచిన్నఘణపూర్
గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగయ్యతో కలిసి ప్రారంభించారు. ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి, ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి, దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేయాలని పిఎసిసిఎస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూరెగారి నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పాశం శ్రీనివాస్ రెడ్డి, బాగారెడ్డి, రాజా గౌడ్, రవితేజ రెడ్డి, ముత్యంగారి సంతోష్ కుమార్, సందీప్, లక్ష్మీనారాయణ గౌడ్, మురళి గౌడ్, మంగలి శంకర్, సీఈఓ కృష్ణ, రైతులు, పిఎసిఎస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.