వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
తూకంలో ఎలాంటి అవకతవకలు జరగదు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారుల సహాయంతో ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచన లు క్రమం తప్పకుండా పాటిం చి కొనుగోలు కేంద్రం నిర్వా హకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యా సంగి పంటలో వరిసాగు పెరి గిందని వరి ధాన్యం కొనుగో లలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.వరి బస్తాలు కాంట వేయడంలో 40 కిలోల 650 అంతకంటే ఎక్కువ జోకకూ డదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో మండల తాసిల్దార్ సత్యనారా యణ, ఎంపీడీవో ఫణి చంద్ర ,వ్యవ సాయఅధికారి గంగా జము నా, అధికారులు, మండల అధ్యక్షుడు దూదిపాల బు చ్చిరెడ్డి, బాసని చంద్రప్రకాష్, దుబాసి కృష్ణమూర్తి, బాసని శాంత- రవి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, అబ్బు ప్రకాష్ రెడ్డి, చక్రపాణి, చిరంజీవి, భాస్కర్ , అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమా నులు, ప్రజలు,, మహిళలు తదితరులు పాల్గొన్నారు.