ఉప్పు ఆంజనేయులు సన్మానించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూలు నేటి ధాత్రి
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మల్లికార్జున సత్రం డైరెక్టర్ ఉప్పు అంజనేయులు జన్మదిన వేడుకలను హైదరాబాదులో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ఆంజనేయులుకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున అన్న సత్రం చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్,, డైరెక్టర్లు బచ్చు రామకృష్ణ, ఆగిరి రవి, మేడిశెట్టి సురేష్,మిరియాల రాజయ్య, కల్మచర్ల రమేష్, శివ జగదీశ్వర్, చిగుళ్ళపల్లి శ్రీధర్ తదితరులున్నారు.