‘‘కారణజన్ముడు’’..’’కేసిఆర్‌’’.

ప్రపంచంలోనే ఏ ఉద్యమ కారుడు పడనన్ని కష్టాలు, నష్టాలను, నిర్భందాలు ఎదుర్కొని తెలంగాణ సాధించిన మహోద్యమ నాయకుడు కేసిఆర్‌ అంటున్న బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి వర్యులు ‘‘తన్నీరు హరీష్‌ రావు’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో కేసిఆర్‌ పోరాటం గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

`తెలంగాణ కోసమే పుట్టిన మహాత్ముడు కెసిఆర్‌.

`తరతరాల తెలంగాణ యాతన తీర్చిన దేవుడు కెసిఆర్‌.

`అరవై ఏళ్ల గోస నుంచి తెలంగాణకు విముక్తి ప్రసాదించిన యోధుడు కెసిఆర్‌.

`దేశంలోనే ఏ నాయకుడు కేసిఆర్‌ కు సాటి కారు.

`కేవలం తెలంగాణ కోసం పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాడిన వీరుడు కెసిఆర్‌.

`అలుపెరగని ఉద్యమ ప్రయాణం సాగించిన ధీరోధాత్తుడు కెసిఆర్‌.

`అవమానాలెన్నింటినో తెలంగాణ కోసం దిగమింగారు.

`ఎదురు దెబ్బలెన్నింటినో మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు.

`ప్రాణాలను సైతం తెలంగాణ కోసం పణంగా పెట్టారు.

`పదవులను గడ్డిపోచల్లా విసిరిపారేశారు.

`తెలంగాణ తప్ప మరేమీ వద్దని తెగేసి చెప్పిన ధైర్యవంతుడు కెసిఆర్‌.

`ప్రలోభాలను కాలి గొటితో తన్ని అవతల పడేశారు.

`దేశంలోని పార్టీలన్నింటినీ తెలంగాణ కోసం ఏకం చేశాడు.

`తెలంగాణ సమాజాన్ని ఏక తాటి మీదకు తెచ్చాడు.

`పసి పాప నుంచి పండు ముసలి దాకా జై తెలంగాణ అనేలా చేశాడు

`నిద్రిస్తున్న పసిపాప కూడా తెలంగాణ మాట విని కేరింతలు కొట్టేలా చేశాడు

`చెట్టు, చేమ, పుట్ట, ఆకు, అలము అన్నీ జై తెలంగాణ అనేలా చేశాడు

`కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చారు

`కేసీఆర్‌ లాంటి మహానుభావుడు యుగానికొక్కరే పుడతారు

`ప్రజల నుంచి వచ్చి, ప్రజలను నాయకులను చేసిన విశ్వనాయకుడు కేసిఆర్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సారు, కారు అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సంకేతం. సంక్షేమాన్ని పంచిన కేసిఆర్‌ నాయకత్యానికి ప్రజలు గుండెల్లో పెట్టుకున్న నమ్మకానికి సందేశం. అభివృద్ధికి నడకలు నేర్పి, ప్రగతిని పరుగులు పెట్టించిన కేసిఆర్‌ ను అనుక్షణం గుర్తు చేసుకోవడానికి అవకాశం. నిరంతరం కేసిఆర్‌ స్మమణ చేసుకొవడానికి తెలంగాణ ప్రజల నాలుకల మీద నాట్యమాడుతున్న పదం. తెలంగాణ చెదరిపోకూడదు..కలలు కరిగిపోకూడదు..కళ్ల ముందు ఆవిష్కరించిన అభివృద్ధి ఆగిపోకూడదని ప్రజలకు ఎంతో వినమ్రంగా చెప్పారు. నిజం గడపదాటేలోపు అబద్ధం అరవై ఊళ్లు చుట్టి వచ్చినట్లు కాంగ్రెస్‌ చేసిన మోసపూరిత వాగ్థానాలు నమ్మారు. కాంగ్రెస్‌ ను ఒక్కసారి నమ్మితే అమ్మేస్తారని కేసిఆర్‌ పదే పదే చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమం. కాకపోతే ఎన్నికల సమయంలో ఏమరపాటుతో ఒక్కసారి చేసే పొరపాటు ఐదేళ్లు శిక్షలా మారుతుందనడానికి కాంగ్రెస్‌ పాలనే నిదర్శనం. అందుకే తెలంగాణ ప్రజలు మళ్లీ మళ్లీ సారే కావాలి. కారే కావాలి. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక కేసిఆర్‌ స్వర్ణ యుగ పాలన కావాలని బలంగా కోరుకుంటున్నారు. అది బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ద్వారా మరోసారి ప్రపంచానికి తెలియనుంది. బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో ఎంతటి బలంగా వుందో చూడబోతున్నారు. కేసిఆర్‌ ఎంతటి శక్తివంతమైన నాయకుడో మరోసారి దేశ రాజకీయాలు తెలుసుబోతున్నాయి. ఎందుకంటే కేసిఆర్‌ అందరి లాంటి నాయకుడు కాదు. ఆయన ఒక కారణన్ముడు. ప్రపంచంలోనే ఏ ఉద్యమ కారుడు పడనన్ని కష్టాలు, నష్టాలను, నిర్భందాలు ఎదుర్కొని తెలంగాణ సాధించిన మహోద్యమ నాయకుడు కేసిఆర్‌ అంటున్న బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్‌ రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కేసిఆర్‌ పోరాటం గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

కేసిఆర్‌ తెలంగాణ కోసమే పుట్టిన మహాత్ముడు. కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు. తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ సాధనకు ఎవరి బలం సరిపోయేది కాదు. కేసిఆర్‌ లాగా ఎవరూ తెగించిపోరాటం చేయకపోయేవారు. అందుకే గతంలో 1969లో తెలంగాణ ఉద్యమం సాగినా చప్పున చల్లార్చారు. తెలంగాణ ఉద్యమాన్ని సమైక్య వాదులు ఊదేశారు. తర్వాత మళ్లీ కేసిఆర్‌ జై తెలంగాణ అనే వరకు ఎత్తిన పిడికిలి తెలంగాణ వచ్చే దాకా దించకుండా నాయకులు లేరు. తెలంగాణ పోరాట మొత్తం చరిత్రలో తొలి అడుగు నుంచి తెలంగాణ తెచ్చే దాక కొట్లాడిన ఏకైక పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్‌. అందుకే తరతరాల తెలంగాణ యాతన తీర్చిన దేవుడుగా ప్రజల చేత కొలువబడుతున్నాడు. స్వప్రయోజన రాజకీయాల కోసం పాకులాడి నాయకులై, పదవులతో పలుకుబడి పొందిన వారు ఎందరో గొప్ప నాయకులమని విర్రవీగుతుంటారు. మా అంతటి నాయకులు లేరని గొప్పలకు పోతారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రజల కోసం పోరుబాట పట్టిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. అరవై ఏళ్ల గోస నుంచి తెలంగాణకు విముక్తి ప్రసాదించిన యోధుడు కేసిఆర్‌. అందుకే దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ నాయకుడు కేసిఆర్‌కు సాటి లేరు. అంతటి నిబద్ధత కలిగిన వారు లేరు. దశాబ్దాల తరబడి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు గొంతు సవరించిన మలి తరం నాయకుడు కేసిఆర్‌. కేవలం తెలంగాణ కోసం పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాడిన వీరుడు. దేశ చరిత్రలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని, రాజకీయాన్ని రంగరించి, సుదీర్ఘ కాలం పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఆయనతో పాటు తెలంగాణ కోసం కేసిఆర్‌ వేసిన తొలి అడుగులో అడుగునైనందుకు నా జన్మ కూడా ధన్యమైంది. కేసిఆర్‌ వెన్నంటే వుంటూ తెలంగాణ సాధన కోసం ఆయన అడుగు జాడల్లో నడిచే అదృష్టం నాకు కలిగింది. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్‌ తో కలిసి సాగే బాగ్యం నాకు దక్కింది. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్‌తో కలిసి సాగే అవకాశం దక్కింది. అందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే అలుపెరగని ఉద్యమ ప్రస్థానాన్ని సాగించిన ధీరోధాత్తుడు కేసిఆర్‌. పద్నాలుగేళ్ల ప్రయాణంలో ఎప్పుడూ అలుపు లేదు. అలసట లేదు. విరామం తీసుకున్న సందర్భం లేదు. పండుగ లేదు. పబ్బం లేదు. ఆకలి లేదు. నిద్ర లేదు. తెలంగాణ నామస్మరణ తప్ప పద్నాలుగేళ్లు మరో వ్యాపకం లేదు. అంతటి అంకిత భావం వున్న నాయకుడు మన దేశంలోనే లేరు. తెలంగాణ కోసం అవమానాలెన్నింటినో తెలంగాణ కోసం దిగమింగారు. అడుగడుగునా ఎదురైన అనేక సవాళ్లను చేధించుకుంటూ కేసిఆర్‌ ముందుకు సాగారు. బెదిరింపులులకు బెదరలేదు. అదింపులకు అదరలేదు. ఏ ఒక్క క్షణం భయాన్ని దరిచేరనివ్వలేదు. తాను ఒక్కడుగా మొదలై కొన్ని లక్షల మంది కేసిఆర్‌ లను తయారు చేసిన ఉద్యమ కారుడు కేసిఆర్‌. పద్నాలుగేళ్లలో ఎదురు దెబ్బలెన్నింటినో మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. ప్రాణాలను సైతం తెలంగాణ కోసం పణంగా పెట్టారు. ఇక కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వాలంటే ఆమరణ నిరాహారదీక్ష ఒక్కటే పరిష్కారమని తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్దపడ్డారు. స్వర్గపుటంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చారు. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చిన తెలంగాణను పండగ చేయడానికి కేసిఆర్‌ బతికుండాలని ముక్కోటి దేవతలు అశీర్వదించారు. కేసిఆర్‌ ఆరోగ్యాన్ని దైవాలే కాపాడారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులే కాపాడాయి. అలా జీవితం అంచుల దాక వెళ్లి వచ్చిన కేసిఆర్‌ మరింత గట్టిగా పోరాటం చేశారు. ప్రకటించిన తెలంగాణ వెనక్కి తీసుకోవడాన్ని దేశం ముందు పెట్టారు. ప్రజా స్వామ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ పరిహాసం చేయడాన్ని నిలదీశారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేశారు. తెలంగాణ కోసం 37 రాజకీయ పార్టీల సమ్మతిని కూడగట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తప్పించుకోలేని అష్ట దిగ్భందనాన్ని కేసిఆర్‌ సృష్టించారు. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితుల్లోకి కాంగ్రెస్‌ ను నెట్టివేశారు. రాజకీయ చాణక్యంతో తెలంగాణ సాధించి, రాజ్యాంగ పరమైన విజయాన్ని తెలంగాణ ప్రజలకు అందించారు. తెలంగాణ కోసం తన పదవులను గడ్డిపోచల్లా విసిరిపారేశారు. అందుకే తెలంగాణ తప్ప మరేమీ వద్దని తెగేసి చెప్పిన ధైర్యవంతుడు అని యావత్‌ తెలంగాణ కొనియాడిరది. తెలంగాణ తప్ప అని కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన రాజకీయ ప్రలోభాలను కాలి గొటితో తన్ని అవతల పడేశారు. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలనే కాదు, దేశంలోని పార్టీలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేలా చేశాడు. మొత్తం తెలంగాణ సమాజాన్ని ఏక తాటి మీదకు తెచ్చాడు. ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కాని ఉద్యమాన్ని నిర్మించారు. పసి పాప నుంచి పండు ముసలి దాకా జై తెలంగాణ అనేలా చేశాడు. బోసి నవ్వుల పసి హృదయాలను కూడా గెలిచాడు. తొట్టెల్లో నిద్రిస్తున్న పసిపాపలు కూడా తెలంగాణ మాట విని కేరింతలు కొట్టేలా చేశాడు. సమాజమే కాదు, చెట్టు, చేమ, పుట్ట, ఆకు, అలము అన్నీ జై తెలంగాణ అనేలా చేశాడు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రకృతితో బంధం వేశాడు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చారు.

కేసిఆర్‌ లాంటి మహానుభావుడు యుగానికొక్కరే పుడతారు.

జనం నుంచి నాయకుడైన కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ సాక్షిగా కొన్ని లక్షల మందిని బిఆర్‌ఎస్‌ నాయకులగా మార్చిన విశ్వనాయకుడు కేసిఆర్‌. అలా తెలంగాణ కోసం పెట్టిన పార్టీ బిఆర్‌ఎస్‌ పురుడు పోసుకొని 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. రజతోత్సవాలు జరుపుకునేందుకు వరంగల్‌ వేధికగా నభూతో నభవిష్యత్‌ అని ప్రపంచమంతా కొనియాడేలా లక్షలాది మందితో సభకు సిద్దమౌతోంది. తెలంగాణలోని ప్రతి పల్లె నుంచి వరంగల్‌ కు చీమల దండు కదిలినట్లు ప్రజలు తరలిరానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!