20, 21 వార్డులల్లో ఎమ్మెల్యే జీఎస్సార్ పర్యటన
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20, 21 వార్డులు హనుమాన్ నగర్, శాంతినగర్ తదితర వార్డులల్లో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఇతర శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే జీఎస్సార్ పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వారి సమస్యలతో కూడిన దరఖాస్తులను ఎమ్మెల్యే కు ఇవ్వగా, వారి సమస్యలను వింటూ కాలనీల్లో కలియతిరిగారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ
ప్రథమ కర్తవ్యం అని ఎమ్మెల్యే అన్నారు. కాలనీలల్లో ముఖ్యంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా, కాలనీలో నెలకొన్న విద్యుత్, పారిశుధ్య సమస్యలను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఓసీ – 2 తో ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడి పలువురి ఇళ్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వారికి వెంటనే పరిష్కార మార్గం చూపాలని సింగరేణి జీఎం, ప్రాజెక్టు ఆఫీసర్ కు ఎమ్మెల్యే సూచించారు.
నాగుల పంచమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
మహిళలు అత్యంత పవిత్రంగా కొలిచే నాగుల పంచమి ఈరోజు. ఈ పర్వదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా నాగదేవత ఆలయాలు, పుట్టల వద్ద మహిళలు పాలుపోయడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, భూపాలపల్లి లోని హనుమాన్ ఆలయం లో ఎమ్మెల్యే జీఎస్సార్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగదేవత విగ్రహానికి పాలు పోశారు. ఆ నాగేంద్రుడి దివ్యమైన ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ అప్పం కిషన్ తిక్క ప్రవీణ్ దాట్ల శ్రీను ముంజల రవీందర్ కురిమిళ్ళ శ్రీనివాస్ పద్మ తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు