“MLA GSR Offers Prayers at Buguloni Venkateswara Temple”
బుగులోని వేంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. మెట్ల మార్గం ద్వారా ఎమ్మెల్యే వెళ్తూ, భక్తులతో మాట్లాడారు. పలువురు భక్తులు ఎమ్మెల్యే తో సెల్ఫీలు దిగారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఎమ్మెల్యే గుట్ట కింద ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే భక్తులనుద్దేశించి మీడియాతో మాట్లాడారు. శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జాతరకు రూ.7 కోట్లు నిధులు కేటాయించిందని, ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
జగ్గయ్యపేటలో ఏనుగు రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒడ్డాల తిరుపతికి చెందిన ఏనుగు రథం వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి రథాన్ని జాతరకు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేసి టెంకాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో భూమిలోని జాతర చైర్మన్
