Adinarayana Statue Unveiled in Pambapur
స్వర్గీయ ఆదినారాయణ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ స్వర్గీయ మొగిలిశెట్టి ఆదినారాయణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మరియు ముఖ్య నాయకులతో కలిసి హాజరై, విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ఆదినారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదినారాయణ ఇరవై ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పంబాపూర్ గ్రామ సర్పంచ్ గా ప్రజాసేవకు పునీతుడైన గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే కొనియాడారు. పంబాపూర్ గ్రామాభివృద్ధికి బాటలు వేసిన నిరంతర శ్రామికుడు ఆదినారాయణ అని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
