Bhupalpally MLA Hoists National Flag on Republic Day
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంజూరునగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మరికొంత మంది నాయకులతో కలిసి పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యానికి రాజ్యాంగ నిర్మాణానికి తమ ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, రాష్ట్రం దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చల్లూరు మధు అప్పన్ కిషన్ గాజర్ల అశోక్ తిరుపతి విజయ్ తదితరులు పాల్గొన్నారు
