భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో శ్రీ వేంకటేశ్వర స్కిన్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే కు క్లినిక్ యాజమాన్యం, కాంగ్రెస్ నేతలు పుష్ప గుచ్ఛం అందించి శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం క్లినిక్ ను ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ఈ క్లినిక్ ద్వారా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యాన్ని అందించి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. క్లినిక్ కు వచ్చే వారిని చిరునవ్వుతో పలకరిస్తూ వారి అభిమానాన్ని చూరగొనాలన్నారు. క్లినిక్ ప్రారంభోత్సవం సందర్భంగా యజమాన్యానికి ఎమ్మెల్యే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.