గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలోని సి ఎస్ ఐ పాఠశాలలో మెర్రి క్రిస్మస్ వేడుకలు జరిగినవి. ఇట్టి వేడుకలలో ముఖ్య అతిధిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ముందుగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవులు క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.