MLA GSR Supports 42% BC Reservation in Bhupalpally
బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం
రిజర్వేషన్లు ఇవ్వవలసిందే ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించింది.ఈ బంద్కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కొరకు సర్వే నిర్వహించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపియడం జరిగింది. బీసీలకు 42 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారని దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గవర్నర్ ను మధ్యలో అడ్డు పెట్టుకొని నాటకం చేస్తుందని విమర్శించారు.అందుకే గవర్నర్ గారు అట్టి ఆర్డినెన్సును ఎటు తేల్చకుండా పెండింగులో పెట్టారు అన్నారు.అని దీనికంతటికీ ముఖ్య కారణం కేంద్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని విమర్శించారు. మాకు కోర్టుల మీద గౌరవం,నమ్మకం ఉంది.కావునా బీసీ లందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ సుంకరి రామచంద్రయ్యా అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసీ సభ్యులు చల్లూరి మధు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
