
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ శంకర్
భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం గుంటూరుపల్లి* గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వెల్ది నాగేశ్వర్ రావు దినకర్మ వేడుకలు శనివారం వారి స్వగృహంలో జరిగాయి. కాగా, వారి దినకర్మ లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* చిట్యాల మండల ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం నాగేశ్వర్ రావు చిత్రపటం వద్ద పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. కొద్దిసేపు వారి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని ఎల్లవేళలా వారి కుటుంబ సభ్యులను అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన నల్లూరి శ్రీనివాసరావు గారు అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట చిట్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.