Free Skill Training for Women Launched
అలీవ్ సంస్థ మహిళలకు ఉచిత శిక్షణ ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ర్యాంపు పథకంలో భాగంగా అలీవ్ సంస్థ మహిళలకు ఉచిత శిక్షణ నైపుణ్య సాధన సమృద్ధి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉచిత శిక్షణల ద్వారా మహిళలు వివిధ రంగాల్లో నైపుణ్యాలను సంపాదించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ ప్రతిభను మెరుగుపరుచుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడంతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. శిక్షణ అనంతరం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజి కిష్టయ్య స్థానిక సర్పంచ్ వారణాసి మౌనిక అంజి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
