
MLA GSR Slams Modi Over Vote Theft
మోడీ చేసిన ఓటు చోరీ రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే ఎమ్మెల్యే జీఎస్సార్..
భూపాలపల్లి నేటిధాత్రి
గురువారం లోకసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీపై చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ ఒకరి ఓటు దొంగలించడం అంటే ఒకరి హక్కులను దొంగలించడమే అన్నారు.మోడీ ఓటు చోరీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి చేసిన ద్రోహం అని, ప్రజాస్వామ్యాన్ని రక్షించు కోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ చల్లూరి మధు బుర్ర కొమురయ్య అప్పం కిషన్ దాట్ల శ్రీనివాస్ పిప్పాల రాజేందర్ జంబోజు పద్మ చల్లూరి సమ్మయ్య తోట రంజిత్ బౌత్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.