Women Empowerment Rally Launched in Bhupalpally
ఉమెన్ ఎంపవర్మెంట్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
మహిళల శక్తి దేశాభివృద్ధికి పునాది
భూపాలపల్లి నేటిధాత్రి
బుధవారం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారత కేంద్రం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మహిళల సాధికారత, విద్య, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి సంఘాల బలోపేతం చేయాలన్నారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. మహిళల భద్రత, స్వాభిమానంతో జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు.
ఈ ర్యాలీలో మహిళా సంఘాల సభ్యులు, యువతులు, స్థానిక నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
