మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి, మేదరమట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే జీఎస్ఆర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇప్పలపల్లి గ్రామం నుండి పోతుగల్ మీదుగా కోర్కిశాల వరకు రూ 3.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మేదరమట్ల గ్రామం నుండి అంకుషాపురం వరకు రూ.1.62 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కటంగూరి రాంనర్సింహారెడ్డి, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా నాయకులు పోలినేని లింగారావు, అప్పం కిషన్, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు, నాయకులు కేతిపేల్లి తిరుపతిరెడ్డి, నడిగోటి రాము, బద్దం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.