భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల/కొత్తపల్లిగోరి/గణపురం మండలాలలో
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 26వ తేదీ నుండి అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రజా ప్రభుత్వంలో అర్హులైన అసలైన లబ్ధిదారులకే అందేలా చూస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని జూకల్, చల్లగరిగ, కొత్తపల్లిగోరి మండలంలోని సుల్తాన్ పూర్, గణపురం మండలంలోని కర్కపల్లి గ్రామాలలో జరిగిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హుల ఎంపికకు సంబంధించి గ్రామ సభలు జరగ్గా, ఆయా గ్రామాలల్లో జరిగిన గ్రామ సభలల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయా గ్రామాలల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలల్లో ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 26 నుండి ఈ నాలుగు పథకాలను ప్రారంభించనున్నదని, పథకాల అమలులో భాగంగా ఈరోజు నుండి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో గ్రామస్తులను, ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలన్నారు. కొత్తగా ప్రారంభించబోయే నాలుగు పథకాలు ఓ అద్భుతమని కార్యక్రమం అని, ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే నాలుగేళ్లలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు