ఎమ్మెల్యే జిఎంఆర్ మాతృమూర్తిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు..
పటాన్ చేరు, నేటి ధాత్రి :
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి మాతృమూర్తి శ్రీమతి గూడెం మాణెమ్మ గారిని సోమవారం ఉదయం రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు పరామర్శించారు. చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హరీష్ రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు , నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు పరామర్శించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.
