ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు గడ్డిగాని పల్లి, సెగ్గంపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి ఎన్నికల ఇంచార్జి, మాజీ మంత్రి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు ఎన్నికల ప్రచారం నిర్వహించారు


ఈ సందర్భంగా సెగ్గంపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.
సెగ్గంపల్లి ప్రజలు ఆలోచించాలి.
ఒక్క ఓటు వేస్తే భూపాలపల్లి పట్టణం ఎంత అభివృద్ధి జరిగిందో గమనించాలి
మీరు అడగకున్న సెంటర్ లైటింగ్ తో డబల్ రోడ్డు వేసుకున్నాం. భూపాలపల్లి
చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు ఎదిగిన భూపాలపల్లి.
జిల్లాతో పాటు అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలను ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుని వచ్చిన
మీరిచ్చిన అవకాశం దుర్వినియోగం చేయలేదు.భూపాలపల్లికి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి మీ ముందుకు వచ్చిన.
మరొక్క అవకాశం ఇవ్వండి భూపాలపల్లి పట్టణానికి సమగ్ర ప్లానింగ్ మాస్టర్ ప్లాన్ తీసుకుని వస్తా.
మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల తీసుకుని వస్తా.
పట్టణ మహిళల స్కిల్ డెవలప్మెంట్ భవనం ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశం కల్పిస్తా.
ఫార్మా, ఐటి రంగాలను భూపాలపల్లికి తీసుకుని వస్తా.
భూపాలపల్లి జిల్లాను రానున్న రోజుల్లో పారిశ్రామిక రంగంలో ముందు ఉంచుతా.
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో నిధులను తీసుకుని వచ్చి అభివృద్ధి చేస్తున్న
105 కోట్లతో వర్షపు నీరు ఆగకుండా ఒక మాస్టర్ ప్లాన్ తీసుకుని వస్తా.
సెగ్గంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా చేస్తాను.
పోటీ చేసే అభ్యర్థులకు ఏమి చేస్తారో చెప్పారు కానీ ఎంత సేపు నన్ను తిట్టడమే పనిగా తిరుగుతున్నారు.
ఎమ్మెల్యే గా నేను సామాజిక సేవ కార్యక్రమాల్లో నా కుమారుడు,భార్య నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.
జి ఎం ఆర్ ఎం ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ పరిధిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు, విద్యార్థులకు మాకు తోచిన స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నాం.
ప్రజా జీవితంలో ప్రజల దగ్గర కానీ,నాయకుల దగ్గర కానీ ఏమి ఆశించలేదు.
ఒకరు తప్పు చేస్తే నేను సహించను,నా దగ్గర ఉన్న కౌన్సిలర్ ఇబ్బంది పేడుతుంటే వెంటనే తీసేసిన గుణం నాది.
తెలం6రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశంలో ఎక్కడ జరగడం లేదు.
మన పక్కరాష్ట్రం కర్ణాటకలో 5గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని అక్కడి రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
కానీ తెలంగాణా రాష్ట్రంలో 24గంటల నాణ్యమైన విద్యుత్తు రాష్ట్రంలో అమలులో ఉన్న రైతు బంధు, రైతు భీమా,ఇంటింటికి నీళ్లు దేశంలో ఎక్కడా లేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి అధికారంలో రాగానే చేసే పనుల్ని మేనిఫెస్టో రూపంలో అందించారు.
అధికారం వచ్చిన తొలి నాల్లలోనే ప్రతి పథకం అమలు చేస్తాం
కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కోర్టులకో కేసుల వేసిన పార్టీలు చిన్న సంఘటనకు అంగిలి చింపుకుంటున్నారు.
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అనతికాలంలోనే ఎత్తిపోతల ప్రాజెక్ట్ లని నిర్మించిన ఏకైక నాయకుడు కేసీఆర్.
ప్రజలందరు మరొక్క అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకట్రాణి సిద్దు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పట్టణ అధ్యక్షుడు ఖటకం జనార్ధన్ గ్రంధాలయ సంస్థ చైర్మన్ రమేష్ పిఎసి చైర్మన్ మేకల సంపత్ బుర్ర రాజు శిరీష దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!