గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో గండ్ర సమ్మారావ్ ట్రస్ట్ పతిమా రిలీఫ్ హాస్పటల్ డాక్టర్ శ్యాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముందుగా మొక్కను నాటి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే కాంక్ష చాలా గొప్పదని అన్నారు ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ప్రతీ ఆరు నెలలకు ఒకసారి తమ ఆరోగ్య స్థితిగతులపై టెస్ట్ లు నిర్వహించుకోవాలని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి వాతావరణం కల్పించేందుకే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు గ్రామంలో సుమారు300 మందికి పైగా కంటి పరీక్షలు బీపీ షుగర్ ఈసీజీ బ్లడ్ శాంపిల్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు