భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని బస్టాండ్ దగ్గర రజక సంక్షేమ సంఘం భూపాలపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చాకలి ఐలమ్మ అని, వారందించిన పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని అన్నారు. అణిచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటనా పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ మున్సిపల్ చైర్మన్ వెంక రాణి సిద్దు వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి క్యాతరాజ్ సాంబమూర్తి రవీందర్ బుర్ర కొమురయ్య చంద్రగిరి శంకర్ రజక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు