Bhupalpally MLA Campaigns in Neredupalli
నేరేడుపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటన
సర్పంచ్ అభ్యర్థి మడికొండ ఇందిరా రాజును గెలిపించాలని పిలుపు
శాయంపేట, నేటిధాత్రి:
గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరముందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఆయన శాయంపేట మండలంలోని నేరేడుపల్లి, అప్పయ్యపల్లి, ప్రగతిసింగారం, కాట్రపల్లి, సాధనపల్లి, సూర్యనాయక్ తండా, గంగిరేణిగూడెం, వసంతాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి, ఇతర నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అయ్యాయి. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ను బలపరచడం ద్వారా ఈ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది,” అని పేర్కొన్నారు. ప్రజల పాలనలో ప్రజల భాగస్వామ్యమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక నాయకులు పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన..,
నేరేడుపల్లి గ్రామంలో ప్రజలకు “సీరియల్ నంబర్ 5లో ఉన్న లేడి పర్సు గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి మడికొండ ఇందిరా రాజును గెలిపించండి” అని గ్రామస్థులను కోరారు.
గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పాలన అవసరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.
