
భూపాలపల్లి నేటిధాత్రి
కొత్తపల్లిగోరి రేగొండ మండలాలు
విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా పనిచేస్తే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం విద్యుత్ అందిస్తుందని, విద్యుత్ అధికారులు కారణాలు లేకుండా గంటల కొద్ది కరెంట్ కట్ చేయడంపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు కొత్తపల్లిగోరి, రేగొండ మండల కేంద్రాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి విజిట్ చేశారు. అనంతరం సబ్ స్టేషన్లో ఉన్న లాగ్ బుక్స్ ను తనిఖీ చేయగా, రేగొండ సబ్ స్టేషన్ లో లాక్ బుక్ లో మే 22వ తేదీ రోజున వైట్నర్ పెట్టి దిద్దినట్లు ఉండగా, ఎందుకిలా చేశారని ఏఈ, ఆపరేటర్లను అడగ్గా వారు సరైన సమాధానం చెప్పలేదు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ… విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా పనిచేస్తే ఊరుకునేది లేదన్నారు. ఒకవైపు ప్రభుత్వం నిరంతర విద్యుత్ ను అందిస్తుంటే గ్రామాలకు సమాచారంలేకుండా గంటల తరబడి విద్యుత్ నిలుపుదల ఏంటని ఏఈ కనకయ్య ను ఎమ్మెల్యే ప్రశ్నించగా, తనకు తెలియదని సమాధానమిచ్చారు. దీంతో, ఏ ఈ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనరావుపేట ఫీడర్లో సుమారు 11 గంటల పాటు కరెంట్ సరఫరా నిలుపుదల చేయడంతో లైన్ మెన్, ఆపరేటర్ పై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. విద్యుత్ అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అన్నారు. సరిగా పని చేయని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు పాల్గొన్నారు