భూపాలపల్లి నేటిధాత్రి
పేద, నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి, టేకుమట్ల, రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 60 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు రూ.18,98,500 విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్భాందవునిలా ఆదుకుంటుంది అని తెలిపారు. మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగపరచుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మహా అన్నదానం.
వినాయక నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని భూపాలపల్లి లోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన గణనాథునికి పూజా కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. కాగా మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వందలాదిమంది భక్తులకు అన్నదానం చేశారు. ఆ వినాయక స్వామి కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతీ కుటుంబం కూడా దినదిన అభివృద్ధి సాధించాలని స్వామి వారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ పీసీసీ మెంబర్ చల్లూరు మధు జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య రంజిత్ సాంబమూర్తి జిల్లా నాయకులు కత్తి సంపత్ వివిధ మండలాల నాయకులు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది