భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని క్రిష్ణ కాలనీ అయ్యప్ప స్వామీ దేవాలయంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర పద్మ సత్యనారాయణ రావు దంపతులు అయ్యప్ప స్వామి భక్తుల మహా మండల పడి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులు నిర్వహించిన పూజా కార్యక్రమాలను అధిష్టించి స్వామి వారికి పూజలు నిర్వహించారు. భక్తుల ఆధ్యాత్మిక ఆరాధనను అభినందిస్తూ, భక్తి ప్రధానమైన ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి విలువైన మార్గదర్శకంగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి మాలధారణ దివ్యత్వాన్ని ప్రశంసిస్తూ, భక్తుల సంకల్పం, ఆధ్యాత్మిక ఆరాధన సమాజంలో శాంతి, ఐక్యతను కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధి కి తన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే భక్తులకు శుభాకాంక్షలు చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు