చిట్యాల,నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో రూ.6కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం రోజున శంకుస్థాపన చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి,
అనంతరంఆయా గ్రామాలలో స్థానిక ప్రజలతో మమేకం అవుతూ సాగిన ఎమ్మెల్యే గండ్ర.
మొదటగా బావుసింగ్ పల్లి గ్రామంలో రూ.160 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన.వరికోల్ పల్లి గ్రామంలో రూ.10లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన.వెంచరామి గ్రామంలో రూ.256లక్షలతో అందుకుతండా ఆర్ అండ్ బి నుంచి వెంచరామి వరకు బిటి రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన.అందుకుతండా గ్రామంలో రూ.20లక్షలతో నూతన ఉప వైద్య కేంద్ర భవన నిర్మాణం కోసం శంకుస్థాపన.రూ.20 లక్షలతో గిద్దెముత్తరాం ఆర్ అండ్ బి నుంచి కాల్వపల్లి గ్రామం వరకు బి టి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.అనంతరం కాల్వపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.రాజకీయంగా ఉన్న రోజుల్లో ప్రజలకు చిరకాల వాంఛగా ఉండే కోరికలను నెరవేర్చడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.
నియోజకవర్గ పరిధికి చిట్ట చివరి గ్రామంగా ఉన్న కాల్వపల్లి కి 256లక్షల నిధులతో బి టి రోడ్డు వేయడం వలన స్థానిక గ్రామ ప్రజలు రహదారి, నిత్య అవసర రవాణ సదుపాయాలు మెరుగు పడుతాయి.
ప్రత్యేక గ్రామ పంచాయతీ లు గా ఏర్పడిన ప్రతి గ్రామం పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి.
గడిచిన 9 ఏళ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలిచింది.కేసీఆర్ తెచ్చిన నీళ్ల ప్రాజెక్ట్ ల ద్వారా ఈ రోజు దేశానికే అన్నపూర్ణ రాష్ట్రం గా ఏర్పడింది.
రైతు గోస తెలిసిన ఉద్యమ నేత ముఖ్యమంత్రి కావడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. అని అన్నారురెండు పర్యాయలు భూపాలపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడిగా ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలు అభివృద్ధి కార్యక్రామాలను, సంక్షేమ పథకాలను అమలు చేసిన.ఓడిపోయిన సమయంలో కూడా అప్పుడున్న పరిస్థులు పట్ల ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన..గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి,ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆలోచించాలి.నిరుపేద కుటుంబంలో వుండి గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా మరణించిన రైతు కుటుంబానికి 5లక్షలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.రైతు భిమాతో పాటు రైతు పంట సహాయం క్రింద ప్రతి ఏటా 10వేల రైతు బంధు ఇస్తున్న ప్రభుత్వం. అని అన్నారుఈ కార్యక్రమంలో ఎంపీ పీ దావు వినోద వీరారెడ్డి, జడ్పీటీసీ లు పులి తిరుపతి రెడ్డి,గొర్రె సాగర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ ఏఎంసి వైస్ చైర్మన్ కూర మహిపల్ రెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మడికొండ రవీందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు అరపెళ్లి మల్లయ్య,ఆయా గ్రామాల సర్పంచ్ లు,పంచాయతీ రాజ్ డి ఈ ఏయ్ రవి కుమార్,ఎంపీడీఓ రామయ్య మరియు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.