
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో గురువారం రోజున భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.జడలపేట గ్రామంలో రూ.50లక్షలతో గ్రామాల్లో ఆర్ అండ్ బి రోడ్డు వెంట సైడ్ డ్రైన్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన .రామచంద్ర పురం గ్రామంలో రూ.10లక్షలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన
నవాబుపేట గ్రామంలో రూ.10లక్షలతో సీసీ రోడ్లు, రూ.10లక్షలతో, రూ.50లక్షలతో ప్రధాని రహదారి వెంట సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు, అనంతరంఆయా గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దసరా పండుగకు అందిస్తున్న బతుకమ్మ కానుక బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద ,జడ్పిటిసి గొర్రె సాగర్ ,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆరేపల్లి మల్లయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.