మంచిర్యాల, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి అందరికీ తినిపించారు. సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు డేగ ప్రవీణ్ కుమార్, జైపూర్ మండలంలోని శెట్పల్లి మాజీ సర్పంచ్ మేడి రవి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్ నీ శాలువాతో సత్కరించి,కేక్ కట్ చేపించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఉన్నత పదవులు అధిష్టించాలని, అద్భుతమైన పాలన కొనసాగించాలని, ప్రజాసేవలో తమ తండ్రిగారిలా ఎనలేని కీర్తి గణించాలని, ప్రవీణ్ కుమార్,మేడి రవి ఆకాంక్షిస్తున్నామని తెలియజేశారు.