శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో బోగి పర్వదినం సందర్భంగా కొత్తపల్లి(బి) గ్రామానికి చెందిన క్యాతం ఐలయ్య – వసంత మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే అట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముగ్గులు మన సంస్కృతి, సంప్రదాయాలకు మహిళల సృజనాత్మకతను ప్రతిబింబించే కళారూపమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన సంప్రదాయాలు భావి తరాలకు చేరుతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో మహిళల భాగస్వామ్యంతో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరింత విస్తరించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
