BRS Flag Will Fly in Zahirabad and Kohir: MLA Manik Rao
బిఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్ రావు ,డీసీఎంస్ చైర్మన్ శివ కుమార్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి దేవి ప్రసాద్ మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి డి ఆర్ యు సి సి మెంబర్ షేక్ ఫరీద్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఆర్ సుభాష్,కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు, నాయకులు మాట్లాడుతూ జహీరాబాద్, కోహిర్ మున్సిపల్ లో బిఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు . 37 వార్డులలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు బిఆర్ఎస్ టికెట్లు ఇచ్చామని తెలిపారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహిళలు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకపోవడంతో ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్, కోహిర్ లో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
