
MLA Dr. Bhukya Murali Nayak
తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా” భూక్యా మురళీ నాయక్
గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుంది…
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని సబ్ స్టేషన్ తండాలో తీజ్ పండుగ వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు బాదావత్ పవన్ కళ్యాణ్ ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ శాసనసభ్యులు డా”భూక్యా మురళీ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ, గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు.గిరిజన మహిళలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండగ తీజ్,అని భక్తి శ్రద్ధలతో జరుపుకోవలన్నారు.
తీజ్ పండగ సందర్భంగా గోధుమ బుట్టలు నెత్తిన పెట్టుకొని పాటలు పాడుతూ, గిరిజన నృత్యం చేసిన గిరిజన మహిళలు.గిరిజనుల తో కలిసి గోధుమ బట్టలు నెత్తిన పెట్టుకున్న ఎమ్మెల్యే డా మురళీ నాయక్ ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా పూజించే గిరిజన సాంస్కృతిక పండగ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉంది.శ్రావణ మాసంలో గిరిజన మహిళలు అంతా కలిసి ఘనంగా నిర్వహించుకునే తీజ్ పండుగ గిరిజన సాంస్కృతిక వైభవానికి నిదర్శనం అన్నారు. ప్రకృతి తమను చల్లగా చూడాలని కోరుకున్నారు.పూలను, ప్రకృతి ని ఆరాధిస్తూ పండుగలు జరుపుకోవటం మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా మారిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తండావాసులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.