
Congress ranks meet MRO, MPDO
అట్టడుగు వర్గాల అభివృద్దే ఎమ్మెల్యే దొంతి లక్ష్యం
దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్
ఎమ్మార్వో,ఎంపిడిఓ కలిసిన కాంగ్రెస్ శ్రేణులు
నర్సంపేట,నేటిధాత్రి:
అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా దొంతి మాధవరెడ్డి పనిచేస్తున్నారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో తహశీల్దార్ రాజేశ్వర్ రావు,ఎంపిడిఓ అరుంధతి,ఎస్సై రావుల రణధీర్ రెడ్డితో పాటు పలువురు అధికారులకు బుదవారం మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చుక్క రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు తీసుకెళ్తూన్నా ప్రజా నాయకుడు దొంతి మాధవ రెడ్డి అని అన్నారు. పేదోళ్ళ సొంతింటి కల నెరవేర్చేందుకుగాను ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో నియోజకవర్గంలో రేషన్ కార్డ్ ఇవ్వలేదని,నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇంచ్చిందన్నారు.దేశంలో ఎక్కడలేని విధంగా ఉచిత రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూన్నా ఘనత రాష్ట్ర ప్రభుత్వందే అని పేర్కొన్నారు.రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్షేత్రస్థాయిలో సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజ్మీరా రవీందర్, ఉపాధ్యక్షులు నల్ల వెంకటయ్య, కామ శోభన్ బాబు,కోశాధికారి జంగిలీ రవి,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమ్మ లక్ష్మయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఎంపిటిసి సభ్యులు బొల్లపెల్లి రాము,నియోజకవర్గ యూత్ నాయకులు డ్యాగం శివాజీ,గిన్నె స్వామి, విరాట్, రాజేశ్వర్ రావు,తదితర మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.