
MLA Donthi Family Participates in Vinayaka Immersion
వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి కుటుంబం
నర్సంపేట,నేటిధాత్రి:
గణపతి నవరాత్రుల ఉత్సవాల ముగింపు కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హన్మకొండలోని తన నివాసంలో గణనాథున్ని ప్రతిష్ఠించుకొన్న కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించారు.శుక్రవారం నిమజ్జన కార్యక్రమం చేపట్టగా గణనాథుడికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దంపతులు వీడ్కోలు పలికారు.కాగా ఎమ్మెల్యే దొంతి కుమార్తె అనన్యరెడ్డి హన్మకొండ పద్మాక్షమ్మగుట్ట వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నర్సంపేట నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు.