హనుమాన్ ఆలయ చైర్మన్ బెజ్జంకి ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి
నెక్కొండ:నేటి ధాత్రి
మండల కేంద్రానికి చెందిన హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బెజ్జంకి వెంకటేశ్వర్లు తల్లి బెజ్జంకి లక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బెజ్జంకి వెంకటేశ్వర్లకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజిపి బండి శివ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పోలిశెట్టి భాను, కాంగ్రెస్ నాయకులు సింగం ప్రశాంత్, రావుల మైపాల్ రెడ్డి, వెంకన్న, శ్రీకాంత్, వీరస్వామి, ప్రభాకర్, షబ్బీర్ ,అన్వర్, తదితరులు లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు .