నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ముందు బసవేశ్వర జయంతి వేడుకల సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బసవేశ్వర చిత్రపటానికి పూలమాలవేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 12 వ శతాబ్దంలో జన్మించాడని బసవన్న బసవుడు అని విశ్వగురు అని పిలుస్తారని అన్నారు. సమాజంలో కుల వ్యవస్థను, వర్ణబేదాలను ,లింగ వివక్షతను, సామూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది లింగాయత్ ధర్మం స్థాపించారని పేర్కొన్నారు. కర్ణాటకలోని భాగేవాడే ప్రాంతం జన్మస్థలం అని 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించాడని అలాగే ప్రత్యేకంగా ఐదు రూపాయల నానంపై బసవేశ్వరుని చిత్రీకరించపడ్డ గొప్ప మహానుభావుడు బసవేశ్వరుడు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ వడ బలిజ సంక్షేమ సంఘం గౌరవ ఆధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్,శానా ఉమామహేశ్వర్,అధ్యక్షులు మహాదేవుని రాజవీరు,కార్యదర్శి మహాదేవుని జగదీష్,ఉపాధ్యక్షులు కాపాటి నాగేందర్,కోశాధికారి కల్పకూరి రాజేందర్, కొటారి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.