Peddi Sudarshan Reddy Alleges Rowdy Politics by Narsampet MLA
రౌడీరాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కోడ్ ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే
ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ నాయకులపై దాడులు
దాడిపట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆగ్రహం..బాధితులను పరామర్శ
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
స్థానిక సంస్థల ఎన్నికలలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ రౌడీ రాజకీయం చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దొంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బి ఆర్.ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిని ఖండిస్తునట్లు తెలిపారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో సోమవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడిచేశారు.తీవ్రంగా గాయపడిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నర్సంపేట పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ ఎమ్మెల్యే పెద్ది పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నారని అలాగే ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికి పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దొంతి ఎన్ని ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల ప్రచారాల్లో ఇందిరమ్మ ఇళ్ల ముచ్చట తప్పా అభివృద్ధిపై ఎమ్మెల్యే ఊసెత్తడంలేదన్నారు.ఎన్నికల ప్రచారంలో గిరిజనలకు ఏం అభివృద్ధి చేశారని కాంగ్రెస్ నాయకులను నిలదీయడంతో దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రశ్నించిన గ్రామస్తులపై రౌడిషీట్లు నమోదు చేయాలని పోలీసులకు హుకుంలు జారి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు సోమవారం రాత్రి దాడి జరిగితే ఇప్పటివరకు ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా వెళ్ళలేదని,ఫిర్యాదు ఇస్తేనే పోలీసులు స్పందిస్తారని అని ప్రశ్నించారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట రూరల్ మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి
ప్రచారం చేస్తున్నారని అందుకుగాను పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయగా నాపైనే కేసు నమోదు చేస్తా అంటున్నారని మండిపడ్డారు.ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఇప్పటికే జరిగిన దుగ్గొండి నల్లబెల్లి ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు.చెరువుకొమ్ముతండాలో జరిగిన దాడిలో ఐదుగురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారని ఘటనపై రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒడిసిఎంఎస్ చైర్మెన్ రామస్వామి నాయక్,చెన్నారావుపేట మాజీ ఎంపీపీ,మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గౌడ్, నర్సంపేట పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,మాజీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు,పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
