కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
దేవరకద్ర /నేటి ధాత్రి:
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దామాగ్నాపూర్ గ్రామంలో దేవరకద్ర మండలానికి చెందిన పలువురికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గురువారం లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద రాజగోపురం ముందు షెడ్డు నిర్మాణం సంబంధించిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.