ఇంటింటికి బిఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం కనగర్తి గ్రామంలో శనివారం రోజున బిఆర్ఎస్ ఇంటింటికి ప్రచార కార్యక్రమం లో పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కళాకారులు డప్పు చప్పులతో ఆహ్వానించారు.ఈ సందర్భంగా పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేయబడుతున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు వివరించారు.
కనగర్తి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం కొరకు దాదాపు రెండు కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు.886 మందికి పెన్షన్ ప్రతి నెల 22 లక్షల పదిహేను వేల రూపాయలు ఇస్తుందన్నారు,సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుండి 175 మందికి 50 లక్షల 16,000 300 రూపాయలు పేదవారికి అందించడం జరిగిందన్నారు. ఎల్ ఓ సి ద్వారా రెండు లక్షల 50 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. మహిళా బిల్డింగ్ కొరకు 8 లక్షల 25 వేల రూపాయలు ఇప్పించారని మళ్ళీ ఏడు లక్షల రూపాయలు పూర్తి చేయడం కొరకు అందిస్తామన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 2340 మంది వినియోగించుకున్నారన్నారు.రైతుబంధు పథకం ద్వారా మూడు గ్రామాలకు కలిపి 2212 మంది రైతులకు ప్రతి పంటకు 20 కోట్ల 35 లక్షల రూపాయలు అందిస్తున్నామన్నారు.తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత కరెంటు కొరత కూడా లేకుండా జరిగిందన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న తీరును వివరించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుబంధు, రైతు బీమా, దళిత బందు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇంకా ఎన్నో పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపాయనున్నారు.
అధికారంలో ఉన్న నాడు ఏమి చేయలేని వారు నేడు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
గత పాలకుల హయాంలో పెద్దపెల్లి నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలు ఆశీర్వదించాలని తనని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఓదెల మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఐ రెడ్డి వెంకట్ రెడ్డి, మండల ఎంపిటిసిలు సరోజన- మొండయ్య, కనగర్తి సర్పంచ్ కోట దామోదర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రావుల స్వామి, ఉపాధ్యక్షులు అంబాల కుమార్, కొట్టే మహేందర్, దుర్గయ్య, సదాశివ్, మణికంఠ, శ్రీనివాస్, సదయ్య, శంకరయ్య టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!