పలు సిసి రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం
ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పర్యటనలో భాగంగా కరకగూడెం మండలంలోని సమత్ బట్టుపల్లి, బట్టుపల్లి గ్రామపంచాయతీ, రేగళ్ల గ్రామపంచాయతీ, కన్నయ్య గూడెం గ్రామపంచాయతీలలో 70 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సిసి రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ పోలేబోయిన శ్రీవాణి, తిరుపతయ్య, తోలం నాగేశ్వరరావు, ఎర్ర సురేష్, మండల మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు