రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసిఆర్-ధర్మారెడ్డి
పరకాల నేటిధాత్రి(టౌన్)
సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసీఆర్ పరిపాలన కొనసాగుతున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం దామెర మండల కేంద్రంలో రూ.2కోట్ల 13లక్షలతో నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం,రూ.20లక్షలతో మహిళ భవనాన్ని ప్రారంభం చేశారు. అనంతరం మార్చి నెలలో కురిసిన అకాల భారీ వర్షాలకు పంట నష్టపోయిన 1583 మంది రైతులకు గాను రూ.1కోటి 36లక్షలకు పైగా విలువచేసే నష్టపరిహారం చెక్కులు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేశారు.రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.ఏనాడూ గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు రైతులకు నష్టపరిహారం చెక్కులు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు.రైతు పక్షపాతి,రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.అందుకే గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అంటే,రైతులకు అండగా నిలిచి వ్యవసాయం పండుగల నిర్వహించేలా చేసిన ఘనత సిఎం కేసీఆర్ దన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, సొసైటీ,మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు,రైతులు, గ్రామస్తులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు.