ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో(గర్ల్స్) సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన “ముఖ్యమంత్రి అల్పాహార పథకం” ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం తో తరగతి గదిలో ఆకలి నివారించడం,పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం,విద్యార్థుల ఆరోగ్యం & పెరుగుదలను మెరుగుపరచడం,విద్యార్థుల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడం, సాంఘీకరణను మెరుగుపరచడం ముఖ్య లక్ష్యమని తెలిపారు.

ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న 20 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం పేద పిల్లలకు వరమని చెప్పారు.దేశంలో ఇలాంటి అల్పాహార పథకం ఎక్కడాలేదన్నారు. ఇంగ్లిష్‌ మీడియంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. వెయ్యి గురుకులాలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆడపిల్ల చదువుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు.విద్యార్థుల తల్లిదండ్రుల తరుపున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ,వైస్ చైర్మన్ రేవూరి విజయ్ పాల్ రెడ్డి, కౌన్సిలర్లు,ఎంపిపి స్వర్ణలత, డి.పి. ఓ జగదీష్,ఆర్డీవో శ్రీనివాస్,ఎం.ఈ. ఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *