రూ.3కోట్ల 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని వరికోల్ గ్రామంలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలో ఏ.పి. ఎల్.హెల్త్ కేర్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టుమిషన్ శిక్షణా కేంద్రం మరియు గ్రామంలో రూ.3కోట్ల 90లక్షలతో వరికొల్ నుండి హైబోత్ పల్లి, వరికొల్ నుండి చర్లపల్లి వరకు నూతనంగా నిర్మాణం చేపట్టనున్న బిటి రోడ్డు పనులకు శంఖుస్థాపన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాధు నిర్మల సమ్మిరెడ్డి, ఎంపీపీ మచ్చా అనసూర్య రవీందర్, జెడ్పిటిసి కోడెపాక సుమలత కరుణాకర్, వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, బిఆర్ఎస్ పార్టీ నడి కూడ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి,ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి, పిఎ సి ఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిప్పాని హైమావతి సత్యనారాయణ,మాజీ చైర్మన్ బండి సారంగపాణి,తహసీల్దార్ గుండాల నాగరాజు,సుదాటి వెంకటేశ్వర్లు, బొల్లె బిక్షపతి, భీముడి నాగిరెడ్డి, జైపాల్ రెడ్డి, పోశాల అశోక్, రఘుపతి,రామంచ మధుకర్,బిఆర్ఎస్వి నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.